kamal hassan helps to combat corona, kamal hasan on corona, corona virus, corna in telugu, covid 19 in telugu

చైనా లో పుట్టి ఇప్పుడు ప్రపంచాన్నే వ‌ణికిస్తుంది క‌రోనా. ఇక ఈ మహమ్మారి వైరస్ ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసేశారు. ఇక సినీ ప్ర‌ముఖులు కూడా త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుండి సినీ తారలు కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. కానీ ఒక హీరో మాత్రం వీరందరికీ కాస్త విభిన్నంగా ఒక సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు… కమల్ హాసన్.

ఇప్ప‌టికే రోజువారి కూలిగా సినీరంగంలో ప‌నిచేస్తున్న వారి కోసం భారీ ఆర్ధిక సాయాన్ని కూడా ప్ర‌క‌టించాడు కమల్. ఇక మ‌రో అడుగు ముందుకేసి…ఆర్థిక సాయంతో పాటు త‌న ఇంటినీ ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆసుపత్రి వాడుకొవ‌చ్చ‌ని చెప్పాడు.అందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించాల్సిందిగా ఆయ‌న కోరాడు.ఇక క‌రోనా పేరు చెపితేనే భ‌య‌ప‌డి పారిపోతున్న పరిస్థితుల్లో ఏకంగా త‌న ఇంటినే వారికోసం ఆసుప‌త్రిగా మార్చేందుకు ముందుకు వ‌చ్చిన క‌మ‌ల్‌ను అభినందిస్తున్నారు.